Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతికి ముందే ఈ రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు..
అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడుని కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో పూజించడం వల్ల మనసులో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోయి. ధైర్యం శక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే చాలామంది ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని దర్శించుకుంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వచ్చిన హనుమాన్ జయంతికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఎంతో శక్తివంతమైన కొన్ని యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఈ జయంతి ప్రాముఖ్యత మరింత పెరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
హనుమాన్ జయంతి రోజు ఏర్పడే ప్రత్యేకమైన యోగాల కారణంగా కొన్ని రాశుల వారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని, అలాగే శని దేవుడి ప్రభావం నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కర్కాటక రాశి వారికి హనుమాన్ జయంతి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు కొత్త పనులను ప్రారంభించడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు.
హనుమాన్ జయంతి రోజు వృశ్చిక రాశి వారికి కూడా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు కొత్త ఇల్లుతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి మతపరమైన కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మనశ్శాంతి కూడా పెరుగుతుంది.
కుంభ రాశి వారికి కూడా హనుమాన్ జయంతి రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి హనుమంతుడి అనుగ్రహం లభించి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా పొందుతారు. దీంతో పాటు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.