Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి.. రామభక్తుడి జన్మరహస్యం గురించి ఈవిషయాలు మీకు తెలుసా..?
దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. హనుమాంతుడు చైత్రమాసం పూర్ణిమ తిథినాడు ఉదయం బ్రాహ్మీమూహుర్తంలో జన్మించాడని చెబుతుంటారు. హనుమంతుడిని కేసరి, అంజనలకు జన్మించాడని చెబుతారు. అంజన, కేసరి దంపతులు సంతానం కోసం శివుడి కోసం తపస్సు చేశారు. అప్పుడు శివుడు ప్రసన్నమై.. వాయుదేవుడి అంశంతో ఒక కుమారుడిని ప్రసాదిస్తాడు.
హనుమంతుడి పుట్టడం వెనుక అనేక రహాస్యాలు ఉన్నాయని అనేక ఇతిహసాలు ప్రచారంలో ఉన్నాయి. హనుమంతుడు కర్ణాటకలో పుట్టాడని కొందరు చెబుతుంటే, మరికొందరు తిరుపతిలో జన్మించాడని అంటారు. ఇతిహాసాల ప్రకారం.. అంజనాదేవీ బ్రహ్మదేవుడి దగ్గర పూజలుచేస్తు ఉండేదంట. ఒకసారి అంజనా దేవీ.. ఒక ముని తప్పస్సు చేసుకుంటుండగా భంగం కలిగేలా ప్రవర్తిస్తుంది. ఆయన కోతి లాగా ముఖం కల్గి ఉంటారంట. దీంతో ఆ ముని కోపంలో నువ్వుకూడా నాలా.. కోతి రూపంలో ముఖం మారిపోతుందని శపించారంట.
అదే విధంగా వానరంతోనే నీకు పెళ్లి జరుగుతుందని కూడా శాపం ఇచ్చారంట. దీంతో ఆమె మునిని శరణువేడగానే... ఆయన నీకు పుట్టే సంతానం వల్ల శాపం నుంచివిమోచనం కల్గుతుందని చెప్పారంట. ఈక్రమంలో అంజన భూమిమీదకు వెళ్లిపోతుంది. అడవిలో కేసరి అనే వానరంలాగా ఉన్న వ్యక్తిని ఇష్టపడుతుంది. తనను పెళ్లి చేసుకొవాలని అంజనా కోరుతుంది. ఆయన అంగీకరించడంతో ఇద్దరి వివాహాం జరుగుతుంది.
అంజనా, కేసరీలు ఇద్దరు కూడా.. శివుడి కోసం ఘోర తపస్సు చేశారు. దీంతో శివుడు అనుగ్రహించి, వాయుదేవుడి అంశంతో.. ఒక పుత్రుడ్ని కలిగేలా వరమిస్తాడు. దీంతో ఆంజనేయుడు జన్మిస్తాడు. వాయు పుత్రుడి ఆశీర్వాదంతో జన్మించాడు కాబట్టి,వాయుదేవుడని, అంజనాదేవీ బ్లెస్పింగ్స్ తో పుట్టడం వల్ల ఆంజనేయుడని, కేసరి తండ్రి పేరిత కేసరి నందనుడని పిలుస్తుంటారు. ఇంకా హనుమంతుడు జన్మప్రదేశాలకు కూడా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
కొందరు హనుమంతుడు కర్ణాటకలో జన్మించాడని చెబుతుంటారు. గోకర్ణం జన్మభూమి అని,కిష్కింద కర్మభూమి అనికూడా చెబుతుంటారు. మరికొందరు తిరుపతిలోని జాపాలీ ఆంజనేయుడి బర్త్ ప్లేస్ ఇటీవల టీటీడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆంజనేయుడు.. అరేబియా సముద్రంఒడ్డులో జన్మించారని, శివమొగ్గ హనుమాన్ పుట్టారంటూ, రామచంద్రపురం పీఠాధిపతి ఇటీవల వ్యాఖ్యలు చేశారు.
హనుమంతుడు పుట్టడంతోనే అనేక మంది దేవతలు ఆయనకు దివ్యశక్తులు కలిగేలా ఆశీర్వదం ఇచ్చారు. దీంతో హనుమంతుడు.. ఆకాశంలో మండుతున్న సూర్యుడిని చూసి ఫలం అనుకున్నాడు. దీంతో సూర్యుడి వైపు వేగంగా ఎగిరి, వెళ్తాడు. అప్పుడు ఇంద్రడు తన వజ్రయుధంను హనుమంతుడి మీద ప్రయోగిస్తాడు.
ఈ క్రమంలో బాల హనుమాన్ వజ్రాయుధం దెబ్బకు కింద పడబోగా.. వాయుదేవుడు కాపాడతాడు. ఆ తర్వాత వాయుదేవుడు తన వరంవల్ల పుట్టిన బిడ్డ పట్ల ఇంద్రుడు దాడిచేయడంపట్ల కోపంతో సృష్టిలో గాలిని స్తంభింపజేస్తాడు. దీంతో రుషులు, మునులు, దేవతలు వాయుదేవుడిని పుత్రుడికి కోలుకునేటట్లు చేస్తారు. అంతేకాకుండా దేవతలు హనుమంతుడిపై అనేక వరాలను ఇస్తారు. అప్పటి నుంచి హనుమంతుడు తన దివ్యశక్తులు,మహిమలతో అందరికి ఆశ్యర్యపరుస్తుంటాడు.