Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి రోజు ఈ ఐదు పనులు చేస్తే మీజీవితంలో అన్ని శుభయోగాలే..

Mon, 22 Apr 2024-8:33 pm,

చైత్ర శుద్ద పూర్ణిమ రోజున హనుమాన్ జయంతి ఉత్సవంను నిర్వహిస్తారు. ఈరోజున  ముఖ్యంగా హనుమంతుడి ఆలయంలో ధ్వజ స్థంబం మీద కాషాయ జెండా సమర్పించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు. ఇలా చేస్తే మన జీవితంలోని కష్టాలన్ని దూరమైపోతాయంట. మనం చేసుకున్న కర్మలు, గాలిలో దుమ్ము ఎగిరిపోయినట్లు మననుంచి దూరంగా పొతాయని చెబుతుంటారు.    

ఆంజనేయుడికి తమలపాకులమానలు సమర్పించాలి. ఒకసారి సీతమ్మ భోజనం చేసిన తర్వత తమలపాకును తింటుందంట. అప్పుడు సీతమ్మ నాలుకు ఎర్రగా పండుతుదంట. హనుమంతుడు దీనికి కారణం అడగగా.. రామయ్య అంతే నాకు అత్యంత ప్రీతి.అందుకు నా నాలుక పడిందని చెబుతుందంట. అప్పటి నుంచి హనుమంతుడి కూడా తమలపాకులు అంటే ప్రీతి అంట.

హనుమంతుడికి ముఖ్యంగా తెల్ల జిల్లెడు పూలంటే ఎంతో ఇష్టమంట. అందుకు హనుమాన్ జయంతి రోజు ఎవరైతేభక్తులు తెల్లజిల్లెడు పూల మాలను సమర్పిస్తారో వారి మనస్సులోని కోరికలన్ని నెరవేరుతాయి. వారికి గ్రహాదోషాలు అస్సలు ఉండవు. ప్రతిశనివారం, మంగళవారం జిల్లెడు పూలను సమర్పించాలని పండితులు చెబుతుంటారు. 

రావి ఆకుల మీద గంధంతో శ్రీరామ నామంరాసి, ఆంజనేయుడికి మాలగా వేయాలి. ఇలా చేస్తే.. రామనామం రాసిన వారి ఇంట్లో సిరి సంపదలకు ఎప్పటికి లోటు ఉండదని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే ఎక్కువ మంది ఈ రోజు గంధంలో రాముడి పేర్లు ఆకుల మీద రాస్తుంటారు.

ఆంజనేయుడికి సిందూరం అంటే ఎంతో ప్రీతి. అందుకే భక్తులు ఈరోజున సింధూరంను కోనుగోలు చేసి హనుమంతుడికి అలంకరించాలి. సీతమ్మ ఒకరోజు తన తలపాపడలో సింధూరం రాసుకోవడం హనుమ చూస్తాడంట. తన భర్తకు ఇలా చేస్తే మంచిజరుగుతుదంట అని చెప్పింది. దీంతో హనుమ తన ఒండినిండా సింధూరం రాసుకుని రాముడి ముందుకు వచ్చి తన భక్తితో చాటుకుంటాడు. అప్పటి నుంచి హనుమకు భక్తులు సింధూరంను సమర్పిస్తుంటారు. 

హనుమంతుడికి తేనె అంటే ఎంతో ఇష్టమంట. అందుకే హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా హనుమకు స్వీట్లు, తేనెతో ప్రత్యేకంగా వండిన పదార్థాలు ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తే ఆయన ఆనందపడిపోతాడని జ్యోతిష్యలు చెబుతుంటారు. 

ఆంజనేయ జయంతి రోజున ఇంట్లో ఐదు లేదా పదకొండు సార్లు సుందరకాండ పారాయణ చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో.. వారి ఇంట్లో దోషాలు ఉంటే వెంటేనే తొలగిపోతాయి. ముఖ్యంగా పెళ్లికానీ వారికి వెంటనే వివాహా యోగం ఏర్పడుతుంది. కాలసర్పదోషాలు ఉన్న కూడా అవి పూర్తిగా తొలగిపొతాయి.

హనుమాన్ జయంతి రోజునతప్పకుండా పట్టాభిషేకం రాముడి ఫోటో పూజచేయాలి. ఒక వేళ ఇంట్లో ఈ ఫోటో లేనివారు.. శ్రీరామపట్టాభిషేకం పుస్తకం, పట్టాభిషేకం రాముడి ఫోటోలను తప్పకుండా ఇంటికి తెచ్చుకొవాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link