Happy birthday Mrunal Thakur: ఎన్నో అడ్డంకులు దాటి మరి సక్సెస్ అందుకున్న మృణాల్.. నిర్మాతలతో సైతం గొడవ!
సీరియల్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ ఠాకూర్. అయితే తన మొదటి సీరియల్ తనకు ఎటువంటి పేరు తెచ్చి పెట్టలేదు. ఆ తరువాత కూడా.. ఈ నటి పెద్దగా బాగోలేదంటూ.. అవకాశాలు సైతం రాలేదు. ఓ ఇండోనేషియా టీవీ షోలో కూడా నా తెచ్చింది మృణాల్.
కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు తెచ్చుకుంది. ఈ నటి అంతగా బాగా లేదంటూ.. నటన కూడా అంత రాదు అంటూ కామెంట్లో వినిపించాయి. కానీ ఈ అడ్డంకులన్నీ దాటుకొని ప్రస్తుతం.. టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
సూపర్ 30, జెర్సీ లాంటి హిందీ సినిమాల్లో.. నటించిన మృణాల్.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలో సీతగా కనిపించి అందరిని మాయ చేసింది.. ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఈ హీరోయిన్ కి పెద్ద సక్సెస్ అంటిందించింది.
ఆ తరువాత హాయ్ నాన్న.. చిత్రంతో మరో విజయం అందుకుంది ఈ హీరోయిన్. ఆ తరువాత విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో కనిపించింది. ఈరోజు ఈ హీరోయిన్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్తడే విషెస్ తెలుపుతున్నారు.
తాజాగా మృణాల్ ఠాకూర్ తన గురించి ఒక విషయాన్ని పంచుకుంది. ప్రస్తుతం ఆ విషయం సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్తి చేసుకుని రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా విడుదల కాలేదు.
ఈ చిత్రం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘న పూజ మేరీ జాన్ లో అవకాశం వచ్చినప్పుడు.. ఆ సినిమాలో క్యారెక్టర్ నా జీవితానికి దగ్గరగా ఉంది అని అనిపించింది.దాంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. కానీ మమ అన్ని స్క్రీన్ టెస్ట్ లు పూర్తి చేశాక.. నన్ను తీసేసి మరో హీరోయిన్ ని పెట్టుకున్నారనే టాక్ వినిపించడంతో నిర్మాత దగ్గరికి పోయి మరి గొడవపడ్డా. ఒక రకంగా ఈ పాత్ర కోసం చాలా ఫైట్ చేశాను’అంటూ చెప్పుకొచ్చింది.