Happy Birthday Virat Kohli: రికార్డుల రారాజు.. ఛేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్.. టాప్ రికార్డులపై ఓ లుక్కేయండి
విరాట్ కోహ్లీ ఆదివారం (నవంబర్ 5) తన 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఛేజింగ్ అంటే ముందు గుర్తుకువచ్చేది కోహ్లీ పేరే. అందుకే క్రికెట్ పండితులు 'ఛేజ్‌మాస్టర్' అని పిలుస్తారు.
ఇప్పటివరకు వన్డేల్లో 13,525, టెస్టుల్లో 8,676, టీ20ల్లో 4,008 రన్స్ చేశాడు కింగ్ కోహ్లీ.
అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ప్లేయర్లలో 2వ స్థానంలో ఉన్నాడు . సచిన్ టెండూల్కర్ (49) కంటే కేవలం ఒక సెంచరీ దూరంలో ఉన్నాడు. నేడు కోహ్లీ బర్త్ సందర్భంగా సౌతాఫ్రికాపై సచిన్ రికార్డును సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కోహ్లీ కెరీర్‌లో మొత్తం 78 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 49.3, వన్డేల్లో 58.05, టీ20ల్లో 52.74 సగటుతో పరుగులు చేశాడు
టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యంత వేగంగా 4 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. కేవలం 65 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
విరాట్ కోహ్లీ శ్రీలంకపై 10 సెంచరీలు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక దేశంపై అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
1493 రోజులు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. అర్జున, పద్మశ్రీ, ఖేల్ రత్న అవార్డులను కోహ్లీ అందుకున్నాడు.
ప్రస్తుతం 262 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ సెలబ్రిటీ విరాట్ కోహ్లీ. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచంలో అత్యధిక మంది అనుసరించే క్రీడాకారుడిగా కోహ్లీ ఉన్నాడు.