Happy Friendship Day 2024: ఫ్రెండ్‌షిప్ డే వచ్చేసింది, టాప్ 10 గిఫ్ట్ ఐడియాలు మీ కోసం
ఫ్రెండ్‌షిప్ బ్యాండ్
ఇదొక సింపుల్ అండ్ సూపర్బ్ గిఫ్ట్ ఐడియా. మీ స్నేహితుల చేతికి అలంకరణగా కన్పిస్తూ మీ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
టెడ్డీబేర్
టెడ్డీ బేర్ చాలా అందంగా, అందరికీ నచ్చేలా ఉంటుంది. బాల్యాన్ని గుర్తు చేస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టమతుంటుంది
చాకోలేట్స్
అందరూ ఎక్కువగా ఇచ్చేది, అందరికీ నచ్చేది ఇదే. చాకోలేట్స్ బెస్ట్ ఆప్షన్.
హ్యాండ్ మేడ్ కార్డు
చేతితో తయారు చేసిన కార్డు మరో మంచి ఐడియా. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఎంత సమయం వెచ్చించారు, ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది
కస్టమైజ్డ్ ఫోన్ కేస్
మీ స్నేహితునికి నచ్చేట్టు మరో బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్, మీ స్నేహితుని ఫోటో లేదా పేరుతో కస్టమైజ్ చేసిన ఫోన్ కేస్ ఇవ్వవచ్చు
హ్యాండ్ రిటెన్ లెటర్
ప్రస్తుత డిజిటల్ యుగంలో చేతితో అందంగా కవిత రూపంలో ఆకట్టుకునే వాక్యాలతో లెటర్ రాసిస్తే మీ స్నేహితునికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది
హ్యాండ్ మేడ్ జ్యువెల్లరీ
చాలామంది అమ్మాయిలకు జ్యువెల్లరీ అంటే చాలా ఇష్టం. దీనికోసం మార్కెట్లో లభించేవి కాకుండా చేత్తో తయారు చేసి ఇస్తే బాగా నచ్చుతుంది. ప్రత్యేకంగా ఉంటుంది
ఫోటో ఆల్బమ్
పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకునేందుకు బెస్ట్ ఆప్షన్ ఫోటో ఆల్బమ్ తయారు చేసి ఇవ్వడం
కస్టమైజ్డ్ టీ షర్ట్స్
ప్రస్తుతం మార్కెట్లో కస్టమైజ్డ్ ఉత్పత్తులకు కొదవ లేదు. టీ షర్ట్ కస్టమైజ్ చేసి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని రాసి ఇవ్వవచ్చు.
బుక్స్
మీ స్నేహితునికి బుక్స్ ఇష్టమైతే మంచి పుస్తకం ఒకటి కొని బహుమతిగా ఇవ్వవచ్చు