Couple Tips: భార్యాభర్తల మధ్య గొడవ.. సమస్యకు అదే మార్గం..!
వివాహ బంధం ప్రతి ఒక్కరికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆ జీవితం మంచిదైనా కావచ్చు లేదా నరకప్రాయమైన కావచ్చు. అయితే ఈ వివాహ బంధం స్వర్గముగా మార్చుకోవాలన్నా ..నరకంగా మార్చుకోవాలన్నా.. భార్యాభర్తల ఇద్దరి చేతుల్లోనే ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వైవాహిక జీవితం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన కాలంగా పరిగణించబడుతుంది. ఈ వివాహం అనేది మీ మొత్తం జీవితాన్ని తలకిందులు చేస్తుంది అనడంలో సందేహం లేదు.
అందుకే దాంపత్య బంధాన్ని మరింత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలి అంటే అది దంపతుల చేతుల్లోనే ఉంది. ఒక జంట తమ కుటుంబానికి ఎంత ఎక్కువ సమయం మరియు శ్రద్ధని కేటాయిస్తే వారి సంబంధం అంత బలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏ ఒక్కరికైనా సరే పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం సహజం. అలా గొడవ పడకుండా ఉన్నారు అంటే వారి మధ్య కపట ప్రేమ మొదలైందని అర్థం చేసుకోవాలి. తగాదాలు, వివాదాలు ఉంటేనే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుందనటంలో సందేహం లేదు.
ఇకపోతే వైవాహిక బంధం లో వివాదాలు రాకుండా ఉండాలన్న వచ్చిన వివాదాలను పరిష్కరించుకోవాలన్నా.. సరే ప్రతి వివాదానికి ఖచ్చితమైన ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెతకడం దంపతులు ఇద్దరు నేర్చుకోవాలి అప్పుడే వివాహ బంధం మరింత బలంగా మారుతుంది.
ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ఎప్పుడైనా గొడవ పడిన వెంటనే మాట్లాడుకోకుండా కాస్త రిలాక్స్గా సమయం తీసుకుని ఎందుకు గొడవపడ్డాము అన్న విషయాలను ఆలోచించి మరీ గొడవకి కావాల్సిన విషయాలను చర్చించుకున్న తర్వాతనే సమస్యను పరిష్కరించుకోవచ్చు.ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరూ గొడవపడిన తర్వాత చర్చించుకున్నా సరే సమస్య తీరకపోతే పెద్ద వాళ్లతో కూర్చొని సమస్యను తీర్చే ప్రయత్నం చేసుకోవాలి తప్ప బంధాన్ని దూరం చేసుకోకూడదు.
ముఖ్యంగా బెడ్రూంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనీ అందరూ అంటూ ఉంటారు. అందుకే భార్య భర్తలు ఏ గొడవ వచ్చినా సరే తమ ఏకాంత గదిలో ఇద్దరి మధ్య సమస్యలు ఎందుకు వచ్చాయి అని చర్చించుకుంటే ఆ సమస్యలు పెద్దవి కావని పెద్దలు చెబుతున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే వాటిని సామరస్యంగా తీర్చుకునే ప్రయత్నం చేయాలి.