కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
ఒత్తిడిని అధిగమించేందుకు ఒక్కో వ్యక్తి ఒక్కో పని చేస్తుంటారు. ఒకరు పాటలు వింటే, మరో వ్యక్తి డ్యాన్స్, ఇంకొకరు స్విమ్మింగ్, పుస్తకాలు చదవడం.. ఇలా ఒక్కొక్కరది ఒక్కో తీరు. గతంలో జోక్స్‌ను ఒత్తిడిని చిత్తు చేసేందుకే వాడేవారు. ప్రస్తుతం మనం రకరకాల మీమ్స్‌ను వాడుతున్నాం. ఈ తరం పిల్లలకు జోక్స్ కన్నా మీమ్స్ అంటేనే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకుంటారా నేడు మీమ్ క్రియేటర్స్ డే (Happy Meme Creators Day).
అదేంటి ఇలాంటి ఒకరోజు ఉందని మీకు తెలుసా. ఈ రోజు ఎప్పుడు జరుపుకుంటారని ఆలోచిస్తున్నారు కదూ. గతంలో ఫన్నీ కార్టూన్లు, పెయింటింగ్స్, జోక్స్ కూడా ఉన్నాయి.
అయితే ఈ తరహాలోనే వచ్చిన జోక్స్‌కు మీమ్ (Meme), మీమ్స్ అని యూకేకు చెందిన రిచర్డ్ డాకిన్స్ కొత్త పేరు కనిపెట్టారు. నేడు (మార్చి 26న) ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘మీమ్ క్రియేటర్స్ డే’గా జరుపుకుంటారు.
ఆ మీమ్స్ అనే పేరు కనిపెట్టిన యూకేకు చెందిన రచయిత, ఇంగ్లీష్ ఎథాలజిస్ట్, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ రిచర్డ్ డాకిన్స్ పుట్టినరోజును మీమ్ క్రియేటర్స్ డే అని వ్యవహరిస్తున్నాం. మీరు మీ మిత్రులకు, సన్నిహితులకు Happy Meme Creators Day విషెస్ చెప్పండి.
మీమ్ క్రియేటర్ డే సందర్భంగా Helo నుంచి సేకరించిన ఫన్నీ మీమ్స్ ఇక్కడ అందిస్తున్నాం. (Images Credit: Helo)