Happy Valentines Day In Telugu 2024: వాలెంటెన్స్ డే విషేష్, కోట్స్, ప్రేమ సందేశాలు, వాట్సప్ పిక్స్ మీకోసం..

Tue, 13 Feb 2024-11:00 pm,

ప్రతి సంవత్సరం ప్రేమికులంతా ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటెన్స్ డే అని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రేమ దినోత్సవాన్ని ప్రేమికులంతా ఎంతో ఘనంగా జరుపుకోవాలి. వాలెంటెన్స్ డే రోజున ప్రేమ జంటలు బహుమతులతో పాటు సందేశాలను కూడా పంపుకుంటారు. మీరు కూడా ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా మీ జీవిత భాగస్వామికి లేదా మీ ప్రియురాలు సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపాలనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే..

నువ్వు ఈ జన్మకి నాకు పరిచయం అవుతావని అస్సలు తెలీదు.. ఏ దేవుడు మన ఇద్దరినీ కలిపాడో కానీ ఈ జన్మకు మాత్రం ఆ దేవుడు నాకు పెద్ద వరాన్ని నీ రూపంలో అందించాడు.  

నన్ను పుట్టించిన దేవుడిని అడిగాను నా ప్రాణం ఎక్కడ ఉంటుందని.. అప్పుడు ఆ దేవుడు నీ మనసు చూపించాడు.. అవును ఇది అక్షరాల నిజం నా ప్రాణం ఎప్పుడు నీ మనసులోనే ఉంటుంది.

నువ్వు నాకు జీవితాంతం ఎంతో దూరంగా ఉన్నప్పటికీ నా మనసులో మాత్రం ఎల్లప్పుడూ నువ్వు ఉండిపోతావ్..

ప్రేమైనా కోపం అయినా మనం అర్థం చేసుకుని వారిపై చూపిస్తూ ఉంటాం.. దానిని వారు అర్థం చేసుకుంటే ప్రేమ అవుతుంది లేదా అపార్థం చేసుకుంటే వారికి అది టార్చర్ అవుతుంది.

నువ్వు నాకు ఎంత దూరం ఉన్నా నువ్వు నాకు కనిపించక పోయినా ఎల్లప్పుడూ నీ రూపం మాత్రం నా గుండెల్లోనే ఉంటుంది. ఎల్లప్పుడూ నువ్వు నాకు కనిపిస్తూనే ఉంటావు.

నిద్రపోయే ముందు ఆలోచించిన ఆలోచన..ఉదయం లేచాక వచ్చే నా మొదటి ఆలోచన.. ఎప్పటికీ నువ్వే నువ్వే నువ్వే..

నాకోసం ఎల్లప్పుడూ నువ్వు..నీ కోసం ఎల్లప్పుడూ నేను ఒకరికొకరం ఉన్నాననుకునే ధైర్యమే నిజమైన ప్రేమ.. ఇలాంటి ప్రేమ ప్రతిరోజు నిజాయితీ గానే ఉంటుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link