Harvard Study: నెలలో 21 సార్లు శృంగారంలో పాల్గొంటే.. ఆ ప్రాణాంతక వ్యాధికి చెక్..!
శృంగారం ప్రతి మనిషి జీవితంలో ఓ భాగం. జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొంటే ఇద్దరి మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే అనేక వ్యాధుల ప్రమాదం నుంచి కూడా శృంగారంతో బయటపడొచ్చు.
ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది పురుషులు మరణిస్తున్నట్లు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గణాంకాల వెల్లడిస్తన్నాయి. ఈ సంఖ్య మరింత పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలోనే పరిశోధనల నిర్వహించిన హార్వర్డ్ శాస్త్రవేత్తలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. పురుషులు తమ భాగస్వాములతో ఒక నెలలో 21 లేదా అంతకంటే ఎక్కువసార్లు సంభోగంలో పాల్గొంటే.. ఈ ప్రాణాంతకమైన ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోచ్చని వెల్లడించారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని దాదాపు 31 శాతం తగ్గించవచ్చని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం తెలిపింది.
పురుషుల తమ లైంగిక వాంఛను తీర్చుకునేందుకు ఇతర పద్ధతులను అవలంబించినా ప్రయోజనం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
పురుషుల జీవనశైలి, ఆరోగ్యం, ఆహారం ఆధారంగా డేటా రూపొందించిన హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. పురుషులు తమ లైంగిక సంతృప్తిని పొందితే ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోచ్చని వెల్లడించారు.
ప్రొస్టేట్ అనేది లైంగిక సంతృప్తి కోసం ద్రవాన్ని ఉత్పత్తి చేసే పునరుత్పత్తి అవయవం. ఈ ద్రవాలను విడుదల చేయడం ప్రయోజనకరమని చెబుతున్నారు.
1986 నుంచి పెద్ద సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తల నుంచి డేటాను సేకరించారు. 46 నుంచి 81 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 29342 మంది పురుషులు తమ లైంగిక కార్యకలాపాల గురించి చెప్పారు.
తమ భాగస్వామి లేదా తామంతట తాము ఎంత తరచుగా లైంగిక చెందారు..? పునరుత్పత్తి అవయవాల నుంచి ఎన్నిసార్లు ద్రవం విడుదల అవుతుంది..? వంటి విషయాలను తెలుసుకున్నారు.
పురుషులు క్రమం తప్పకుండా స్కలనం చేస్తే.. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు తేల్చారు.