HDFC Bank: కస్టమర్లకు అదిరే గుడ్ న్యూస్ చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. లోన్ తీసుకునేవారికి భారీ ఊరట?

Wed, 08 Jan 2025-9:26 am,

HDFC Bank Interest Rate:  దేశంలోనే ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇది ఆ బ్యాంక్ కస్టమర్లకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోన్స్ తీసుకునే వారికి ఇది ఊరట ఇచ్చే నిర్ణయం అని చెప్పవచ్చు.  చాలా రోజుల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేట్లు ఆధారిత వడ్డీ రేట్లుగా పిలుస్తారు. బ్యాంక్ ఐదు బేసిస్ పాయింట్ల వరకు ఎంసిఎల్ఆర్ తగ్గించగా సవరించిన ఈ రేట్లు 2025 జనవరి 7 నుంచి అమల్లోకి వచ్చాయి. అంటే మంగళవారం నుండి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు ప్రకటించింది. తాజాగా మార్పులు అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసిఎల్ఆర్ 9.15% నుంచి 9.45% మధ్య ఉంటుందని బ్యాంకు వెల్లడించింది.

కనిష్ట వడ్డీ రేటు అంటే బ్యాంకులు లోన్స్ పై వసూలు చేసే గరిష్టంగా తక్కువ వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకుల కోసం ఒకే విధానాన్ని నిర్ధారించేందుకు ఎంసిఎల్ఆర్ ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు ఈ రేటు పై ఆధారపడి రుణాల వడ్డీ రేటులను నిర్ణయిస్తుంటాయి. ఎంసీఏఆర్ తక్కువైతే రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది. అదే ఎం సి ఎల్ ఆర్ పెరిగినట్లు అయితే వడ్డీ రేట్లు కూడా భారీగా పెరుగుతాయి. దీనివల్ల ఎన్సీఎల్ ఆర్ తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది. ఒకవేళ ఎం సి ఎల్ ఆర్  పెరిగినట్లయితే ఈఎంఐ  కూడా పెరుగుతుంది. 

ఓవర్‌నైట్ MCLR 9.20శాతం నుండి 9.15శాతాకి 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 1 నెల, 3 నెలల MCLRలో ఎటువంటి మార్పు చేయలేదు. ఇది వరుసగా 9.20%, 9.30% వద్ద కొనసాగుతుంది. 6 నెలల 1 సంవత్సరం MCLR 9.50% నుండి 9.45%కి 5 బేసిస్ పాయింట్లు తగ్గింది.3 సంవత్సరాల MCLR కూడా 9.50% నుండి 9.45%కి తగ్గింది.  

HDFC బ్యాంక్  MCLR తగ్గింపు ప్రత్యక్ష ప్రయోజనం వారి రుణ రేట్లు MCLRతో అనుసంధానించిన వినియోగదారులకు అందింస్తుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ వంటి ఫ్లోటింగ్ రేట్ లోన్‌ల EMI తగ్గుతుంది. ఈ తగ్గింపు తర్వాత, కస్టమర్‌లు తమ EMIని తగ్గించుకోవచ్చు లేదా లోన్ కాలపరిమితిని తగ్గించుకోవచ్చు. అయితే, రుణం  కాలపరిమితిని తగ్గించడం ఈ విషయంలో ఉత్తమం, ఎందుకంటే ఇది రుణాన్ని చెల్లించడంలో వడ్డీ మొత్తం భారాన్ని తగ్గిస్తుంది.  

ఫండ్స్ ఆధారిత రుణ రేటు  మార్జినల్ కాస్ట్ అంటే MCLR అనేది ఏదైనా ఆర్థిక సంస్థ ఇచ్చే రుణాలపై విధించే కనీస వడ్డీ రేటు. రుణంపై కనీస వడ్డీ రేటు ఎంత ఉండాలనేది ఈ రేటు నిర్ణయిస్తుంది.  

hDFC బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు రెపో రేటుతో అనుసంధానించింది. ప్రస్తుతం ఈ రెపో రేటు 6.50%గా ఉంది. ప్రత్యేక హోమ్ లోన్ రేట్లు (జీతం  స్వయం ఉపాధి): 6.50% + 2.25% నుండి 3.15% = 8.75% నుండి 9.65%గా ఉంది. ప్రామాణిక గృహ రుణ రేట్లు (జీతం, స్వయం ఉపాధి): 6.50% + 2.90% నుండి 3.45% = 9.40% నుండి 9.95%గా ఉంది. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా, బ్యాంకులు ఖాతాదారులకు EMIని తగ్గించడానికి లేదా లోన్ కాలపరిమితిని తగ్గించడానికి అవకాశం ఇస్తాయి. మీ EMIని తిరిగి చెల్లించే సామర్థ్యం బాగుంటే, రుణ కాల వ్యవధిని తగ్గించడం ఉత్తమ ఎంపిక. ఇది మొత్తం వడ్డీ చెల్లింపును తగ్గిస్తుంది.  

డిసెంబర్‌లో ఆర్‌బీఐ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే 2025లో రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని సాధారణంగా విశ్వసిస్తున్నారు. HSBC రీసెర్చ్ ఇటీవలి నివేదిక ప్రకారం, ఫిబ్రవరి, ఏప్రిల్ 2025లో 25 బేసిస్ పాయింట్ల రెండు కోతలు సాధ్యమవుతాయి, దీని కారణంగా రెపో రేటు 6%కి తగ్గుతుంది. అయితే, కొన్ని అంచనాల ప్రకారం, 2025లో వడ్డీ రేట్లను 75 నుండి 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link