Ragi Roti: రాగి పిండి రోటీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం.. రక్తంలో చక్కెరస్థాయిలు హఠాత్తుగా పెరగవు..!
రాగిపిండి షుగర్ వ్యాధిగ్రస్థులకు వరం కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఇందులో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. రాగిపిండి డైట్లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగవు. పోషకాహార నిపుణుల ప్రకారం ప్రతిరోజూ రాగి రొట్టె తింటే కూడా డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు మేలు.
అంతేకాదు డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు బార్లీని కూడా డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఇది కడుపు ఆరోగ్యానికి కూడా మంచిది. మంచి బ్యాక్టిరియా పెరగడానికి దోహదం చేస్తుంది. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. బార్లీ పిండి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.
ఈ రెండు పిండిలు రక్తంలో చక్కెరను హఠాత్తుగా పెరగనివ్వకుండా నియంత్రిస్తాయి. డయాబెటీస్‌వారు తిన్న తర్వాత ఇందులోని ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది.
ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు బార్లీని డైట్లో చేర్చుకోవడం వల్ల చక్కెర స్థాయిలు ఎప్పటికీ పెరగవు. అంతేకాదు శరీరంలో మంట, వాపు సమస్యను కూడా ఇవి సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఇవి డయాబెటీస్ రోగులను వేధించే ఆరోగ్య సమస్య
శనగపిండి కూడా డయాబెటీస్‌తో బాధపడేవారు తీసుకోవచ్చు. ఇది తిన్న తర్వాత కూడా రక్తంలో చక్కెరస్థాయిలు పెరగవు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటుంది. అంతేకాదు శనగపిండి రక్తంలో చక్కెరను త్వరగా శోషించకుండా నివారిస్తుంది. అందుకే సాధారణ పిండి బదులు శనగపిండి వాడండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )