Fatty Liver: డైట్‌లో పొరపాటున కూడా ఈ పదార్ధాలుండకూడదు, లేదంటే ఫ్యాటీ లివర్ సమస్య ముప్పు
చాలామందికి స్వీట్స్ తినడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ స్వీట్స్ వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యకు ఇదొక కారణం.
ప్రోటీన్లు ఎక్కుగా ఉండే రెడ్ మీట్, ఎల్లో ఎగ్ వంటివాటిని దూరంగా ఉంచాలి. లేకపోతే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది.
శాచ్యురేటెడ్ ఆహార పదార్దాలు తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే పిజ్జా, బర్గర్, స్వీట్ షేక్స్ వంటివాటికి దూరంగా ఉండాలి.
రెడీ టు ఈట్ ఫుడ్స్ , ప్యాకెట్ ఫుడ్స్ అనేది ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి అదే పనిగా తింటే ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.
ఫ్యాటీ లివర్ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే ముఖ్యంగా ఆల్కహాల్ సేవించకూడదు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.