Thyroid Care Tips: థైరాయిడ్ కారణంగా కళ్లలో ఈ సమస్యలు కన్పిస్తే..నిర్లక్ష్యం వద్దు, కంటి చూపు కోల్పోతారు
థైరాయిడ్ సమస్య ఉంటే వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి. థైరాయిడ్ సమస్యలో కంటి చుట్టూ వాపు కన్పిస్తుంది. ఈ లక్షణం కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
థైరాయిడ్ సమస్య ఉంటే కళ్లలో డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో థైరాయిడ్ గ్లాండ్‌లో మార్పు రావచ్చు. ఫలితంగా కళ్లలో డ్రైనెస్ సమస్య ఉంటుంది.
థైరాయిడ్ వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతుంది. కళ్లలో మసక ఉంటుంది. ఫలితంగా ఏదీ స్పష్టంగా కన్పించదు
థైరాయిడ్ పెరగడం వల్ల కళ్లలో నీరు ఉబికి వస్తుంటుంది. ఈ లక్షణం ఉంటే కళ్లలో ఎప్పుడూ నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఈ సమస్య కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి
థైరాయిడ్ లక్షణాలు పెరిగినప్పుడు మీ కంటి నరాలు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఈ సమస్య కన్పించే ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకూడదు.