Dry fruits Benefits: డ్రై ఫ్రూట్స్‌లో తేనె కలిపి తింటే కలిగే 5 అద్బుత ప్రయోజనాలు
యాంటీ ఆక్సిడెంట్లు
తేనెను అద్బుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా భావిస్తారు. డ్రై ఫ్రూట్స్‌లో తేనె కలిపి తినడం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి మొత్తం తగ్గిపోతుంది. శరీరంలో హానికారక కణాల్ని నియంత్రిస్తుంది. వివిధ రకాల వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
పోషకాలు
డ్రై ఫ్రూట్స్‌లో తేనె కలిపి తినడం వల్ల పోషకాలు మరింతగా పెరుగుతాయి. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనముంటుంది. శరీరంలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కావల్సినంత లభిస్తాయి.
గుండె ఆరోగ్యం
మీ గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే..కిస్మిస్, ఖుబానీ వంటి డ్రై ఫ్రూట్స్‌కు తేనె కలుపుకుని తింటే..గుండె ఆరోగ్యం అద్బుతంగా మెరుగుపడుతుంది. వీటిలో ఉండే పొటాషియం, ఫైబర్, ఫెనోలిక్ తగిన మోతాదులో ఉండాలి.
ఎనర్జీ ఫుడ్స్
తేనెతో డ్రై ఫ్రూట్స్ కలిపి తినడం వల్ల శరీరానికి అదనపు ఎనర్జీ లభిస్తుంది. మెటబోలిజం కూడా వేగవంతమౌతుంది.
జీర్ణక్రియ
డ్రై ఫ్రూట్స్‌లో బాదం, పిస్తా తీసుకుంటే కావల్సినంత ఫైబర్ శరీరానికి అందుతుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెతో కలిపి తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ పోషకాలు మరింతగా పెరుగుతాయి.