Health Remedies: ఆవనూనెతో అద్భుతాలు, ఈ 5 పదార్ధాలు కలిపి రాస్తే అన్ని సమస్యలు మాయం
ఆవనూనె-ఫిట్కరీ
ఆవనూనెలో ఫిట్కరీ కలిపి రాస్తే తల దురద, మంట, ఎలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆవనూనె-ఉసిరి
ఆవనూనెలో ఉసిరి కలిపి కేశాలకు రాయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య చాలా వరకూ తగ్గుతుంది. కేశాలకు ఇది చాలా ప్రయోజనకరం.
ఆవనూనె-పెరుగు
ఆవనూనెలో పెరుగు కలిపి రాయడం వల్ల డేండ్రఫ్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
ఆవనూనె-అలోవెరా జెల్
ఆవనూనెలో అల్లోవెరా జెల్ కలిపి కేశాలకు రాయడం వల్ల జుట్టుకు అద్భుతమైన నిగారింపు వస్తుంది. కేశాలు నల్లగా నిగనిగలాడుతుంటాయి. వారంలో రెండుసార్లు రాస్తే చాలు.
ఆవనూనె-కర్పూరం
ఆవనూనెలో కర్పూరం కలిపి శరీరానికి రాయడం వల్ల జలుబు, జ్వరం చాలా వరకూ తగ్గిపోతాయి. ఛాతీపై, వీపు భాగంలో రాయడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.