Pista Health Benefits: మదుమేహంతో పాటు ఆ 5 సమస్యలు దూరం కావాలంటే ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే

Sat, 04 Mar 2023-8:36 am,

మధుమేహం నియంత్రణ

డయెబెటిస్ రోగులు నియమిత మోతాదులో పిస్తా తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పిస్తా గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

బరువు నియంత్రణ

పిస్తా ఫైబర్ రిచ్ ఫుడ్‌గా పరిగణిస్తారు. పిస్తా తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలి వేయదు. దాంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పిస్తా రోజూ తినడం వల్ల బరువు నియంత్రణ ఉంటుంది.

ఇమ్యూనిటీ పటిష్టం

క్రమం తప్పకుండా పిస్తా తినేవారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో జింక్, విటమిన్ బి6 కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

పిస్తా ప్రయోజనాలు

పిస్తాలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో ఫ్యాట్, కేలరీలు తక్కువగా ఉన్నందున సూపర్ హెల్తీ ఫుడ్‌ గా పిలుస్తారు. 

జీర్ణక్రియ

పిస్తాలో ఉండే ఫైబర్ కడుపుకి చాలా మంచిది. దీంతో అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు దూరమౌతాయి. అందుకే చాలామంది మెరుగైన జీర్ణక్రియ కోసం పిస్తా తినమనే సలహా ఇస్తుంటారు. 

ఎనీమియా

పిస్తా తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగిపోతుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో ఎనీమియా సమస్య తలెత్తదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link