Health Tips: అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టే అద్భుత చిట్కా, కిస్మిస్‌తో ట్రై చేయండి
పొటాషియం ఎక్కువగా ఉన్న పదార్ధాలు రక్త సరఫరాను నియంత్రిస్తాయి. కిస్మిస్‌లో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు సమస్యకు చెక్ పెడుతుంది. అయితే కిస్మిస్ ఒక్కటే రక్తపోటు సమస్యను తగ్గించదు. దీంతోపాటు తగిన వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటివి చేయాలి.
అదే సమయంలో కిస్మిస్ కూడా అధిక రక్తపోటు సమస్యకు మంచి పరిష్కారంగా ఉంటుంది. పలు అధ్యయనాల ప్రకారం కిస్మిస్ నియమిత రూపంలో తీసుకుంటే అధిక రక్తపోటు తగ్గించవచ్చు. కిస్మిస్ తరచూ తినేవారిలో రక్తపోటు సమస్య పెద్దగా కన్పించలేదు.
అధిక రక్తపోటును ఎదుర్కొనేందుకు ముందుగా జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. అధిక రక్తపోటును ఎదుర్కొనేందుకు టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్ వంటి కెఫీన్ పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఉప్పు తగ్గించాలి. శారీరక వ్యాయామం అవసరం. అరటి, ఆరెంజ్, ఖుబానీ, డ్రై ఫ్రూట్స్ వంటివి తరచూ తీసుకోవాలి.
అధిక రక్తపోటు ఓ సాధారణ అనారోగ్య సమస్య. కానీ ఈ వ్యాధిగ్రస్థులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దీనిని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు ధమనుల్లో రక్తం ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు కారణంగా గుండె, రక్త నాళికలు, మెదడు, కళ్లు, జాయింట్స్ దెబ్బ తింటుంటాయి.
అధిక రక్తపోటు అనేది చాలా ప్రమాదకరం. శరీరంలోని ధమనులు ప్రభావితమౌతుంటాయి. హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు రక్తం గుండె వరకూ చేరడంలో ఇబ్బంది కలుగుతుంది.