Best Fruits: ఈ ఐదు పండ్లు మీ డైట్‌లో ఉంటే చాలు, 5 వ్యాధులు దూరం కావల్సిందే

Mon, 14 Aug 2023-1:25 am,

ఆరటి పండ్లు

మీకు తరచూ మూడ్ స్వింగ్ అవుతుంటే..కోపం విసుగు వెంటాడుతుంటే అరటి పండ్లు తింటే చాలావరకూ తగ్గుతుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. 

ఆరెంజ్

ఆరెంజ్ అనేది శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ అందిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పటిష్టంగాపెరుగుతుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

కివి

కివిలో సైతం విటమిన్ సి అద్భుతమైన మోతాదులో ఉంటుంది. దీనివల్ల ఆస్తమా వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు. వారంలో 4-5 కివీలు తింటే మంచి ఫలితాలుంటాయి.

ద్రాక్ష

మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే రోజూ ద్రాక్ష తింటే చాలా మంచి ఫలితాలుంటాయి. రక్తం లోటును ద్రాక్ష సమూలంగా తీర్చేస్తాయి. అదే సమయంలో రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఆపిల్

పండ్లలో ఆపిల్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అంటారు. ఆపిల్ అనేది పరిపూర్ణమైన పౌష్ఠికాహారం కలిగినది. డయాబెటిస్ రోగులు కూడా తినవచ్చు. ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్, ఆస్తమా సమస్యలు దూరమౌతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link