Health Tips: డైట్‌లో ఈ పదార్ధాలుంటే అన్ని ప్రాణాంతక వ్యాధులకు చెక్
డార్క్ చాకోలేట్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు, గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. చాకోలేట్స్ కాకుండా డార్క్ చాకోలేట్స్ మాత్రమే తీసుకోవాలి.
గ్రీన్ టీలో కైటేచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా గణనీయంగా తగ్గుతుంది.
జైతూన్ ఆయిల్ వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్ చాలా వేగంగా తగ్గుతుంది. స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కంలగా లభించే వాల్‌నట్స్, ఫ్లక్స్ సీడ్స్, చియా సీడ్స్, బీన్స్ వంటివి డైట్‌లో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్‌తో పాటు ట్రై గ్లిసరాయిడ్స్ స్థాయి తగ్గిస్తాయి.
దాదాపు అన్ని రకాల పండ్లలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ బెర్రీ, దానిమ్మ, ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె వ్యాధుల ముప్పు చాలావరకూ తగ్గుతుంది.
ఆకుకూరలైన పాలకూర, తోటకూర, గోరు చిక్కుడు, బ్రోకలీ, బెండకాయల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి.
డ్రై ఫ్రూట్స్‌లో బాదం, వాల్‌నట్స్, వేరుశెనగ, ఫ్లక్స్ సీడ్స్, చియా సీడ్స్ , జీడిపప్పు వంటివాటిలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదపడతాయి.
పప్పుులు కూడా మరో మంచి ప్రత్యామ్నాయం. శెనగలు, బీన్స్, మటర్, పప్పుులు వంటి మొక్క ఆధారిత ప్రోటీన్ ఫుడ్‌లో ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గుతుంది.
తృణ ధాన్యాలు ఇందుకు చాలా ఉపయోగపడతాయి. బాజ్రా, జొన్నలు, బ్రౌన్ రైస్ వంటి తృణదాన్యాల్లో లిక్విఫైడ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ కావడం వల్ల మధుమేహం వ్యాధి నియంత్రణలో ఉంటుంది.