Vitamin P Benefits: విటమిన్ పి గురించి విన్నారా, ఇది ఎందుకు అవసరం, కేన్సర్ కణాల్ని నియంత్రిస్తుందా
కేన్సర్ నుంచి రక్షణ
కొన్ని రకాల బయో ఫ్లెవనోయిడ్స్‌లో కేన్సర్ నిరోధక గుణాలుంటాయి. ఇవి కేన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి. అందుకే విటమిన్ పి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. బ్రెస్ట్, ఊపిరితిత్తులు, కడుపు కేన్సర్ చాలా ప్రమాదకరమైనవి.
ఇమ్యూనిటీ
విటమిన్ సి ఉండే ఆహార పదార్ధాలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో తలనొప్పి, దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరల్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల సెల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
గుండె ఆరోగ్యం
విటమిన్ సికు చెందిన ఆహార పదార్ధాలు తినడం వల్ల రక్త నాళాల పనితీరు మెరుగుపడుతుంది. దాంతో గుండె వ్యాధుల ముప్పు చాలావరకూ తగ్గిపోతుంది.
మెదడు సామర్ధ్యం, పనితీరు
వివిధ రకాల అధ్యయనాల ప్రకారం విటమిన్ పి ఉండే ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడుకు ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత ఉంటుంది. దాంతోపాటు ఓవరాల్ మెదడు సామర్ధ్యం మెరుగ్గా పనిచేస్తుంది.
కంటి వెలుగు
విటమిన్ పి అంటో బయో ఫ్లెవనోయిడ్స్ ప్రత్యేకించి రూటిన్, హెస్పెరిడిన్‌లు కళ్లలోని రక్త నాళాలకు తోడ్పాటునిస్తాయి. కంటి వెలుగును పెంచుతాయి. దాంతోపాటు కేటరాక్ఠ్, మేక్యులర్ డీజనరేషన్ వంటి సీరియస్ సమస్యల ముప్పును తగ్గిస్తాయి.