Uric Acid Problem: యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే ఏయే పప్పు దినుసుల్ని తినకూడదు
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు శెనగలు కూడా ఆలోచించి తినాల్సిన పరిస్థితి ఉంటుంది. వైద్యుని సలహా మేరకు తీసుకుంటే ఏ సమస్యా ఉండదు.
ఎందుకంటే రాజ్మా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది.
యూరిక్ యాసిడ్ పెరిగితే రాజ్మాను డైట్ నుంచి తొలగించేయాలి.
యూరిక్ యాసిడ్ సమస్య పెరిగినప్పుడు ఉలవలకు దూరంగా ఉండాలి. ఇవి ఎక్కువగా కొండ ప్రాంతాల్లో లభిస్తాయి. ఇవి తినడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య మరింత పెరగవచ్చు.
కందిపప్పు, పెసర పప్పుల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉన్నందున వైద్యుని సలహాతోనే వీటిని తీసుకోవాలి.
ఎలాంటి పప్పులు తినవచ్చనేది పప్పుల్లో ఉండే ప్రోటీన్ శాతంను బట్టి ఉంటుంది. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే పప్పుల్ని వైద్యుని సలహా తరువాతే తీసుకోవాలి.
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా డైట్ అనేది చాలా ముఖ్యం. ఏది తినవచ్చు ఏది తినకూడదనేది తెలుసుకోవాలి. పప్పుల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం.