Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి
మల విసర్జన
మల విసర్జన అధికంగా అవడం కూడా దీనికి కారణం. విటమిన్ డి మితంగానే తీసుకోవాలి. విటమిన్ డి ఎక్కువైతే ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు ఎదురౌతాయి.
బలహీనమైన ఎముకలు
ఎముకలు పటిష్టంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. కానీ అవసరానికి మించి వాడితే మాత్రం ఎముకలు బలహీనమైపోతాయి. అందుకే ఎంత మొత్తం అవసరమో అంతే తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు
అవసరానికి మించి విటమిన్ డి తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమౌతాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు ప్రధానంగా కన్పిస్తాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీ ఫెయిల్ కావచ్చు.
ఆకలి తగ్గడం
విటమిన్ డి ఎక్కువైతే ఆకలి తగ్గిపోతుంది. కడుపు నిండినట్టుగా ఉంటుంది. అందుకే విటమిన్ డి వినియోగం ఎప్పుడూ మితంగానే ఉండాలి.
వాంతులు
పోషక పదార్ధాలు సక్రమంగా అందించే ఏ విధమైన వ్యాధి దరిచేరదు. విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటుంటే శరీరంలో చాలా రకాల వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా వాంతులు వస్తుంటాయి. అందుకే విటమిన్ డి పరిమితంగానే తీసుకోవాలి.