Bones Health: ఎముకలు బలంగా ఉండాలంటే ఏవి తినాలి, ఏ అలవాట్లు మానేయాలి
డైటింగ్
చాలామంది తక్కువ తింటే బరువు తగ్గించుకోవచ్చనే ఆలోచనతో డైటింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారా లేదా అనేది పక్కనబెడితే..ఎముకలు, శరీరం బలహీనమైపోతుంది.
కాల్షియం ఆహార పదార్ధాలు
కాల్షియం మన ఎముకలను బలోపేతం చేస్తుంది. ఒకవేళ మీరు మీ రోజువారీ డైట్‌లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే..బోన్ డెన్సిటీ క్రమంగా పెరిగి..ఎముకలు బలంగా మారతాయి.
మద్యం సేవించడం
మద్యం సేవించడం అనేది కేవలం ఓ సామాజిక రుగ్మతే కాకుండా..ఆరోగ్యపరంగా ప్రమాదకరం కూడా. శరీరంలోని చాలా అంగాలపై ప్రభావం చూపిస్తుంది. కానీ పరిమితి దాటి తాగితే...ఎముకలపై ప్రభావం పడుతుంది.
స్మోకింగ్
ఇటీవలి కాలంలో సిగరెట్ స్మోకింగ్ అలవాటు పెరుగుతోంది. ఫలితంగా తక్కువ వయస్సుకే ఎముకలు బలహీనంగా మారుతుంటాయి. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరిగిపోతుంది. అందుకే సిగరెట్ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
ఫిజికల్ యాక్టివిటీ లోపించడం
ఒకవేళ రోజూ 8-10 గంటలు కూర్చుని పనిచేస్తుంటే..ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరిగిపోతుంది. అందుకే వర్కవుట్స్ తప్పకుండా చేయాలి.