Healthy Habits: నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలంటే ఈ 5 అలవాట్లు పాటించాల్సిందే
బరువు తగ్గించడం
ఉదయం త్వరగా నిద్ర లేచి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవక్రియ వేగవంతమై అధిక బరువు రాకుండా ఉంటుంది.
ఒత్తిడికి దూరం
ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల దినచర్య ఆలస్యంగా ప్రారంభమై..ఉరుకులు పరుగులు మొదలౌతాయి. ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా పని ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఒత్తిడికి లోనవుతుంటాం. ఈ పరిస్థితి దూరమవ్వాలంటే త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్ర లేవాలి.
మానసిక సమస్యలకు దూరం
ఉదయం త్వరగా లేవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజువారీ ప్లానింగ్ సరిగ్గా ఉంటుంది. ఫలితంగా మెదడుపై ఒత్తిడి ఉండదు. దాంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు దూరమౌతుంది. మానసిక సమస్యలు వెంటాడవు.
హెల్తీ లంగ్స్
ఉదయం స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీనికోసం తెల్లవారుజామున ఓపెన్ ఎయిర్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
హెల్తీ హార్ట్
అనారోగ్యకరమైన జీవనశైలి గుండె వ్యాధులకు కారణమౌతుంది. ఉదయం త్వరగా లేచి వ్యాయామం చేయడం వల్ల గుండె చాలా వరకూ ఆరోగ్యంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది.