Health Tips: శీతాకాలం వైరల్ వ్యాధుల్నించి రక్షణ కల్పించే ఐదు పద్ధతులు ఇవే
రోజూ నిర్ణీత సమయం వ్యాయామంం లేదా వాకింగ్ అలవర్చుకోవాలి. దీనివల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా రోజూ తగినంత నిద్ర కూడా అవసరం. దీనివల్ల శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలి. దాంతో మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వైరల్ వ్యాధులు తలెత్తకుండా శరీరం పోరాడుతుంది.
మీరు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
దగ్గు లేదా తుమ్ములు వచ్చినప్పుడు నోరు లేదా ముక్కును కప్పుకోవాలి. మీ వెంట టిష్యూ లేదా కర్చీఫ్ తప్పకుండా ఉంచుకోవాలి.
చేతుల్ని సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రం చేసుకోవాలి. ప్రత్యేకించి శౌచాలయం నుంచి వచ్చిన తరువాత భోజనం చేసిన తరువాత ఈ పద్ధతి పాటించాలి.