Piles Precautions: ఈ 5 పదార్ధాలు పైల్స్ సమస్యను మరింత పెంచేస్తాయి తస్మాత్ జాగ్రత్త
షుగర్ డ్రింక్స్
షుగర్ డ్రింక్స్ మలబద్ధకానికి దారి తీస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. ఫలితంగా పైల్స్ లక్షణాలు మరింతగా పెరుగుతాయి.
ఆల్కహాల్, కెఫీన్
మధ్యం, కెఫీన్ తాగడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండకపోతే పైల్స్ సమస్య ప్రమాదకరంగా మారుతుంది.
చిప్స్, స్నాక్స్
చిప్స్, స్నాక్స్ వంటి ఫైబర్ తక్కువగా ఉండే పదార్ధాలు తినడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా పైల్స్ సమస్య మరింతగా పెరుగుతుంది.
ప్రోసెస్డ్ ఫుడ్
ప్రోసెస్డ్ ఫుడ్‌లో ఫైబర్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపర్చాలంటే ఫైబర్ అవసరం. మలబద్ధకం సమస్య తలెత్తితే పైల్స్ మరింత నరకప్రాయంగా మారవచ్చు.
మసాలా భోజనం
మసాలా, కారంతో కూడిన భోజనం పైల్స్ లక్షణాలను మరింతగా పెంచుతాయి. మసాలా భోజనంలో ఉండే క్యాప్సైసిన్ అనే కాంపౌండ్ స్వెల్లింగ్ పెంచుతుంది.