Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు

Fri, 11 Dec 2020-12:54 pm,

How to strengthen Immunity : కరోనా వైరస్ సమస్య ఇంకా అలాగే ఉంది. కచ్చితంగా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉండటం మరిచిపోరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని పదే పదే చేతులతో తాకవద్దు. కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. డాక్టర్లు సైతం సూచిస్తున్న అంశం విటమిన్ సి అధికంగా ఉండే  ఆరెంజ్, నిమ్మకాయ లాంటి రసాలు తప్పనిసరి తీసుకోవాలి. 

Health Tips | రోగనిరోధక శక్తి ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. విటమిన్లు, పోషకాలు మెండుగా లభించే కూరగాయాలు తినాలి. అప్పుడే నూతన ఉత్సాహంతో పనులు చేసుకోవచ్చు.

ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. గుడ్డు తింటే శారీరకంగా బలం చేకూరి రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. కరోనా వైరస్ బాధితులకు సైతం వైద్యులు గుడ్లు అందిస్తున్నారు.

Also Read : Health Benefits Of Bitter Gourd: ఈ ప్రయోజనాలు తెలిస్తే కాకరకాయ కచ్చితంగా తింటారు

తాజా ఆకుకూరలు తింటే కంటిచూపు మెరుగ్గా ఉంటుందని తెలిసిందే. అయితే ఆకుకూరల్లో విటమిన్లు A, C మరియు K లభిస్తాయి. వీటితో పాటు కాల్షియం, మెగ్నీషియం శరీరానికి అందితే నూతన ఉత్సాహంగా కనిపిస్తారు.

Also Read : Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

కరోనా సమయంలో ఉద్యోగులకు సమస్యలు వస్తున్నాయి. వర్క్ హోం పేరిట రోజంతా సీట్లకు అతుక్కుపోతే చాలా అనారోగ్య సమస్యల వ్యాయామం, యోగా, ఎక్సర్‌సైజ్ లాంటి శారీరక శ్రమ చేయాలి. తద్వారా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నీళ్లు సైతం తాగాలి. తక్కువగా నీరు తీసుకుంటే డీహైడ్రేట్ అవుతారు. లేక తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి.  

Also Read : Health Benefits Of Curry Leaves: కరివేపాకుతో షుగర్ కంట్రోల్, గర్భిణులకు మేలు సహా ఎన్నో ప్రయోజనాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link