Brain Food: మీ మెదడు కంప్యూటర్‌లా పనిచేయాలంటే..ఈ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు
తృణధాన్యాల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
వేరుశెనగ గుళ్లలో అవసరమైన న్యూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. దాంతోపాటు ప్రోటీన్లు కూడా కావల్సినంతగా ఉంటాయి. మెదడు పనితీరుని వేగవంతం చేసేందుకు వేరుశెనగ మంచి ఫుడ్
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.
గుడ్లు శారీరక ఆరోగ్యాన్ని పటిష్టం చేస్తాయి. దాంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరం. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
చాలామంది ఎనర్జీ కోసం కాఫీ సేవిస్తుంటారు. అయితే అదే కాఫీలో ఉన్న కెఫీన్ మెదడు సామర్ద్యాన్ని పెంచుతుంది. కాఫీ బ్రెయిన్ మెమరీని మెరుగుపరుస్తుంది.