Udupi Sambar: ఉడిపి సాంబార్ తింటే ఏమి రుచి.. అనాల్సిందే..!
ఉడిపి సాంబార్ తింటే ఏమి రుచి.. అనాల్సిందే..! ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండ..
కావలసిన పదార్థాలు: కందిపప్పు: ఒక కప్పు, టమోటాలు: రెండు, వంకాయ: ఒకటి, గుమ్మడికాయ: ఒక చిన్న ముక్క, క్యారెట్: ఒకటి, పచ్చిమిర్చి: 3-4
కరివేపాకు: ఒక రెమ్మ, ఉప్పు: రుచికి తగినంత, చింతపండు: చిన్న ముక్క, నూనె: 2-3 టేబుల్ స్పూన్లు, ఆవాలు: అర టీస్పూన్, జీలకర్ర: అర టీస్పూన్, ఎండు మిరపకాయలు: 2-3, మెంతులు: అర టీస్పూన్
తయారీ విధానం: ఒక పాన్‌లో నూనె వేసి, సాంబార్ పొడిని కొద్దిగా వేయించుకోవాలి. ఇది సాంబార్‌కు మంచి వాసనను ఇస్తుంది.
కందిపప్పును శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో తగినంత నీరు పోసి ఉడికించాలి.
ఒక పెద్ద పాత్రలో నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, మెంతులు వేసి వేగించాలి.
ఆ తర్వాత తరిగిన కూరగాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగించాలి.
వేగించిన కూరగాయలలో రోస్ట్ చేసిన సాంబార్ పొడిని కలిపి బాగా కలపాలి.
ఉడికించిన కందిపప్పును, తగినంత చింతపండు రసాన్ని కూరగాయల మిశ్రమంలో కలపాలి.
రుచికి తగినంత ఉప్పు వేసి, తగినంత నీరు పోసి కడిగి, మూత పెట్టి మరిగించాలి.
సాంబార్ మృదువుగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వెచ్చగా ఇడ్లీ లేదా దోసలతో సర్వ్ చేయాలి.