Drumstick Tomato Curry Recipe: మధుమేహం ఉన్నవారు తప్పక ట్రై చేయాల్సిన హెల్తీ కర్రీ.. తయారీ విధానం సులభమే..
మునగకాయలు - 250 గ్రాములు (తొక్క తీసి, ముక్కలుగా కోసుకోవాలి), టమాటో - 2 (ముక్కలుగా కోసుకోవాలి), ఉల్లిపాయ - 1 (తరిగినది), వెల్లుల్లి - 5 రెబ్బలు (తరిగినవి)
అల్లం - 1 అంగుళం ముక్క (తరిగినది), ఆకుకూరలు - 1/2 కప్పు (కొత్తిమీర, పుదీనా), నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1/2 టీస్పూన్, జీలకర్ర - 1/2 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్, కారం - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1/2 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో పైనుంచి తొక్క తీసుకున్న మునగకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి.
ఇలా బౌల్లో వేసుకున్న మునగ కాయలను బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు వేసి వేయించాలి.
ఆవాలు బాగా వేగిన తర్వాత 30 సెకండ్లు అలాగే ఉంచి జీలకర్ర, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
ఆ తర్వాత అవి వేగిన వెంటనే వెల్లుల్లి, అల్లం వేసి వాసన వచ్చే వరకు వేయించాలి.
ఆ తర్వాత ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటోలు వేసి, మెత్తబడే వరకు ఉడికించాలి.
టమాటోలు బాగా మెత్తబడిన తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి.
ఆ తర్వాత మునగకాయ ముక్కలు వేసి, 5 నిమిషాలు ఉడికించాలి.
మునగ కాయలు బాగా ఉడికిన తర్వాత అందులోనే కావలసినంత ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాలు ఉడికించాలి.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా పుదీనాతో గార్నిష్ చేసుకొని ఆ తర్వాత కొత్తిమీర పైనుంచి వేసి సర్వ్ చేసుకోవచ్చు.
చిట్కాలు: మునగకాయలను వేయించే ముందు 10 నిమిషాలు నీటిలో నానబెట్టడం వల్ల అవి మృదువుగా ఉంటాయి.
మీరు మరింత రుచి కోసం, 1/2 టీస్పూన్ శొంఠి పొడి కూడా వేయవచ్చు. ఈ పొడి వేసుకోవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
టమాటోలకు బదులుగా కావాలనుకుంటే మీరు 1/2 కప్పు టమాటా ప్యూరీ కూడా వాడవచ్చు.
ఈ వంటను మరింత హెల్తీగా తయారు చేసుకోవడానికి ఇందులో కందిపప్పు లేదా పెసరపప్పును కూడా వినియోగించవచ్చు.