Digestion: అరటి పండు వల్ల శరీరానికి ఎన్ని లాభాలో తెలుసా.. మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలకు చెక్
అరటి పండు అజీర్తి సమస్యలకు చెక్ పెడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి..వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో అమైనో యాసిడ్ ఉంటాయి. కావున మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నాడీ వ్యవస్థ కూడా సులభతరంగా మారుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
అరటి పండులో పీచు పదార్థాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు కూడా చెక్ పెడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో పోటషియం వంటి పరిమాణాలు అధికంగా ఉంటాయి రక్త పోటు సమస్యలను సులభంగా దూరం చేస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌త స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి అరటి పండును తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలను కూడా తగ్గించి.. బాడికీ శక్తిని ఇస్తుంది.
అరటి పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా అరటితో చేసిన పదార్ధాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
అరటి పండులో శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇచ్చేందుకు ప్రాధన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇందులో 105 క్యాలరీల శక్తి లభిస్తుంది. కావున బాడీ వీక్‌గా ఉన్నవారు తప్పకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.