Heart Attack Signs: గుండెపోటుకు ముందు ఈ సంకేతాలు ప్రమాదం, నిర్లక్ష్యం ప్రాణాంతకమే

Mon, 06 Mar 2023-1:34 pm,

అలసట, వీక్నెస్

రోజంతా పనిచేసి అలసిపోవడం సహజమే. కానీ కొన్నిసార్లు ఏమాత్రం పనిచేయకుండానే అలసట, వీక్నెస్ ఉంటుంది. రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఇలా జరుగుతుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఆందోళన

ఇటీవలి ఉరుకులు పరుగుల జీవితంలో సమయం లేకపోవడం, డెడ్‌లైన్‌లో పని ముగించాల్సిన పరిస్థితి ఆందోళనకు ప్రధాన కారణం. దీనివల్ల గుండె ఆరోగ్యానికి ముప్పు వాటిల్లవచ్చు. 2015లో హార్వర్డ్ యూనివర్శిటీ చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఆందోళన అంటే టెన్షన్ కారణంగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కారణంగా ప్రాణాలు పోయే ముప్పు 21 శాతం పెరుగుతుంది. 

చెమట పట్టడం

వేసవికాలంలో చెమట్లు పట్టడం సహజమే. కానీ పెద్దగా ఉష్ణోగ్రత లేకపోయినా అంటే చల్లని వాతావరణంలో కూడా చెమట్లు పడుతుంటే ఆందోళన చెందాల్సిన విషయమే. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

కాళ్ల నొప్పులు

వృద్ధాప్యంలో కాళ్ల నొప్పులనేవి సాధారణమే. కానీ యౌవనంలో కూడా కాలి నరాల్లో నొప్పి ఉంటే మంచి లక్షణం కాదు. నరాల్లో కొలెస్ట్రాల్ పెరిగి బ్లాకేజ్ ఏర్పడటం వల్ల రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి నొప్పులు వస్తుంటాయి

ఛాతీలో నొప్పి

గుండెలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఛాతీలో నొప్పి ప్రారంభమౌతుంది. ప్రత్యేకించి గుండె ఉన్నవైపు నొప్పి ఉంటుంది. ఇది గుండెపోటుకు అతి కీలకమైన వార్నింగ్‌గా భావించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link