Symptoms of Heart Attack: ఈ 6 లక్షణాలు కనిపిస్తే గుండెపోటే..! ఏం చేయాలంటే..?

Thu, 28 Mar 2024-12:32 pm,

గుండెపోటు వచ్చే ముందు ఛాతి, కండరాలు, దవడ, వెన్నుపై వీటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను ముందుగా గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటే అపాయం నుంచి తప్పించుకోవచ్చు.  

గుండెపోటు వచ్చే ముందు దాని మరో లక్షణం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగడం. ఇది కూడా కార్డియాల్ సమస్య. నడిచినప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.  దీన్ని అస్తమా అనుకుని తప్పుగా అంచనా వేయకూడదు.  

గుండె చప్పుడులో మార్పు కూడా గుండెపోటు ముందు వచ్చే మరో లక్షణం హార్ట్‌ బీట్లో అసహజ మార్పులతోపాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే గుర్తించాలి.  

గుండెపోటు వచ్చే ముందు కనిపించే మరో లక్షణం నీరసం. ఏ చిన్న పనిచేసినా నీరసంగా అనిపించడం. రోజూవారీ పనులు కూడా చేసుకోలేకపోవడం కూడా గుండెపోటు లక్షణమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

కాళ్లు, మడమల్లో వాపు కూడా గుండెపోటు లక్షణం. గుండె నుంచి శరీర అవయవాలకు రక్తసరఫరాలో ఇబ్బంది కలుగుతుంది. ఈ విధంగా కాళ్లవాపులు వస్తాయి. ఎక్కువ ఒత్తిడి పెట్టుకున్నా గుండెపోటు తప్పదు.

ఇది చాలామందిలో కనిపిస్తున్న లక్షణం. పొత్తికడుపులో ఇబ్బంది, అనుకోకుండా మోషన్స్ అవ్వడం, విపరీతంగా చెమట పట్టడం కూడా గుండెపోటు లక్షణం. ఇది ఎక్కువశాతం డయాబెటిస్ రోగుల్లో కనిపిస్తుంది.పై ఏ లక్షణాలు కనిపించినా వెంటనే ఈసీజీ చేయించుకోవాలి. ఏ లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదిస్తే తక్షణమే బయటపడొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link