Heavy Rains: ఆంధ్ర ప్రదేశ్ కు భారీ వర్ష సూచన..

అల్పపీడన ప్రభావంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా జిల్లాల్లో చెదురు మదురుగా వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనావేసింది.పలు జిల్లాల్లో నేడు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కూడా తెలిపింది.

విజయనగరం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
ఈ అల్పపీడన ప్రభావం అటు తమిళనాడుపైనా ఉండొచ్చు. చెన్నై సహా ఉత్తర కోస్తా జిల్లాలు- చెంగల్పట్టు, తిరుపత్తూర్, కాంచీపురం, కడలూర్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.ఎవరు చేపల వేటకు.. సముద్ర స్నానాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.