Tirumala: తిరుమలలో కుండపోత.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. డిటెయిల్స్..
తిరుమలలో వరుణుడు దంచికొడుతున్నాడు. అదే విధంగా బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. తిరుమలలో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది. అదే విధంగా వీఐపీ దర్శనం విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. అక్టోబర్ 15న సిఫార్సు లేఖలు తీసుకోమని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
వర్షాల నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని కూడా.. టీటీడీ ఈవో శ్యామల్ రావు ఒక ప్రకటనలో కోరారు.రానున్న.. 48 గంటల్లో తిరుపతిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందనే వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందన్నారు.
అధికారులందరూ విపత్తును ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. కాలి మార్గం ద్వారా వచ్చే భక్తులు అలర్ట్ గా ఉండాలని, ఎక్కడైన కొండ చరియలు కూడా విరిగి పడే అవకాశం ఉందని టీటీడీ చెప్పింది.
అదే విధంగా కొండ ప్రాంతాలపై నిఘా ఉంచాలన్నారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా వైద్యశాఖ అంబులెన్సు లను రెడీగా పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.