Heavy Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన వరదలు

Sun, 18 Oct 2020-3:44 pm,

శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలతో హైదరబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అయితే ఆదివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ (Cyberabad CP Sajjanar), ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owaisi) సందర్శించారు. 

సైబరాబాద్ సీపీ సజ్జనార్ రాజేంద్ర నగర్, గగన్ పహాడ్, ఓల్డ్ కర్నూలు రోడ్, అలీ నగర్ ప్రాంతాల్లో పర్యటించి.. ఇళ్లల్లోనే ఉండాలని ఆయా ప్రాంతవాసులకు సూచించారు.

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలోని హఫీజ్ బాబా నగర్, సమీప ప్రాంతాలను సందర్శించి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

తాజాగా కురిసిన వర్షంతో రహదారులన్నీ వరదతో పొటెత్తాయి. చాలా వాహనాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. నగరం అంతటా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈ క్రమంలోనే మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. 

ఈ మేరకు మరో మూడు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link