Heavy Rains: రేపు ఎల్లుండి భారీ వర్షాలు.. ఈ 3 జిల్లాలకు ఐఎండీ బిగ్ అలెర్ట్..
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్న ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఇది దిశ కూడా మార్చుకుంది. ఇక ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు ఏపీ వాసులు.
అయితే, తాజాగా ఐఎండీ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అనూహ్యంగా దిశ మార్చినప్పటీకి తీవ్ర అల్పపీడనం దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది.
ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
అయితే, ఇవాళ విజయ నగరం, శ్రీకాకుళం, మన్యం, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ఇక వరి కోతలకు వెళ్లే రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. దీనికి మంచు దుప్పటి కమ్మడంతో ఉదయం 9 గంటల వరకు రోడ్లన్ని స్పష్టంగా కనిపించడం లేదు. మరోవైపు ఎముకలు కొరికే చలితో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.