Heavy Rains: ఏపీ తీరం వెంబడి పయనించనున్న అల్పపీడనం.. నేడు ఈ 3 జిల్లాల్లో భారీ వర్షాలు..
![భారీ వర్షాలు Heavy Rains](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Cyclonne4_18.jpg)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చనుంచి. దీంతో కొన్ని ప్రధాన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్న ఈ ప్రాంతాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.
![బంగాళాఖాతం Bay Bengal](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Cyclonee3_12.jpeg)
బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు, మత్స్యకారులను కూడా అలెర్ట్ చేసింది.
![అల్పపీడన Low pressure](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Cyclone_20.jpg)
మిగతా జిల్లాల్లో కూడా నేడు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం వల్ల గంటకు 60 కిలో మీటర్ల మేర ఈదురు గాలులు వీస్తాయి. ఇది తీర ప్రాంతానికి పరిమితమవుతుందట.
ఇదిలా ఉండగా ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపై కూడా ఉంటుంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతాల్లోని ప్రజలను అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ.
మరోవైపు తెలంగాణలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతల స్థాయిలు పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా, పొడిగా నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటలకు వరకు పొగమంచు కమ్మేస్తోంది.