Delhi Chalo protest: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత
ఢిల్లీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు. అంతేకాకుండా హర్యానా ప్రభుత్వం జాతీయ సరిహద్దులను సైతం మూసివేసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, హర్యానా నుంచి ఢిల్లీకి వచ్చే మెట్రో సర్వీసులను సైతం మధ్యాహ్నం నుంచి బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు డ్రోన్‌ల సహాయంతో కూడా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
పంజాబ్ రైతులతో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, కేరళ రాష్ట్రాల్లోని రైతులు కూడా ఢిల్లీ ఛలో మార్చ్‌కు కదలనున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఢిల్లీ సరిహద్దులన్నింటినీ పోలీసులు సీజ్ చేసి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అయితే నిన్న రైతులను హర్యానాలో నిలువరించేందుకు వాటర్ కెనాల్స్‌తోపాటు లాఠిచార్జ్ సైతం చేశారు. అయినప్పటికీ రైతులు అక్కడే ధర్నాకు కూర్చున్నారు.