Actress Sanjeeda shaikh: ఆ రోజు రాత్రి అక్కడ టచ్ చేశారు.. షాకింగ్ అనుభవాన్ని పంచుకున్న హీరా మండి నటి..
నటి సంజీదా షేక్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ది డైమండ్ బజార్ అనే వెబ్ సిరిస్ లో నటించారు. ఈ వెబ్-సిరీస్‌లో సంజీదా షేక్.. అందమైన తార వహీదా అనే వేశ్య పాత్రను పోషించింది. ఇందులో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అదే విధంగా విమర్శలకు నోర్లు కూడా ఆమో మూసేలా చేసింది.
ఇటీవల, హాటర్‌ఫ్లైకి తన ఇంటర్వ్యూలో నటి సంజీదా మాట్లాడుతూ.. గతంలో ఆమెకు ఎదురైన ఒక షాకింగ్ అనుభం గురించి పంచుకుంది. ఒక నైట్‌క్లబ్‌లో ఒక మహిళ తనను అనుచితంగా తాకిన సంఘటనపై సంజీదా ఓపెన్ అయ్యింది. ఒకప్పుడు తనను ఒక మహిళ ఎలా తట్టిలేపిందో ఆ నటి గుర్తుచేసుకుంది.
నైట్ క్లబ్ లో.. నటి సంజీదా షేక్ ఉన్నారు. అప్పుడు ఒక యువతి వచ్చి ఆమెను తట్టి లేపింది. ఆమె ఏకంగా సంజీదా బ్రస్ట్ ని టచ్ చేసి, ప్రెస్ చేసిందని ఆమె చెప్పుకొచ్చింది. వెంటనే తెరుకునే సరిగే యువతి అక్కడి నుంచి జారుకుందని సంజీదా చెప్పుకొచ్చింది.
ఈ ఘటనలో ఒక్కసారిగా షాకింగ్ కు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటి పనులు పురుషులు చేయడం చూస్తుంటాం. మహిళలను టచ్ చేయడానికి చూడటం లాంటి పనులు చేస్తుంటారు. కానీ యువతి ఇలా చేయడం పట్ల తాను షాక్ కు గురైనట్లు నటి చెప్పుకొచ్చింది.
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా ముదుర్లుగా తయారయ్యారని, లడ్కియాన్ కోయి కమ్ నహీ హై.. పురుషుల కన్నా కూడా టూమచ్ పనులు చేస్తున్నారంటూ కూడా నటి తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా... సంజీదా షేక్.. తన భర్త అమీర్ అలీతో విడాకుల గురించి ఓపెన్ అయ్యింది.
సంజీదా , అమీర్‌లు 2012లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు.. 2021లో విడాకులు తీసుకున్నారు. వారికి సరోగసీ ద్వారా ఐరా అలీ అనే కుమార్తె కూడా ఉంది. ఇటీవల, సంజయ్ లీలా బన్సాలీ నెట్‌ఫ్లిక్స్ కోసం తన సూపర్‌హిట్ వెబ్-సిరీస్ హీరామాండి సీజన్ 2ని ప్రకటించారు.