Iron Rich Foods: హిమోగ్లోబిన్ కొరత ఉంటే ఈ 5 ఫుడ్స్ తీసుకుంటే చాలు
దానిమ్మ
హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచేందుకు దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ దానిమ్మ తింటే ఐరన్ కొరతే తలెత్తదు. దీనికితోడు ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
తృణధాన్యాలు
తృణధాన్యాలు డైట్‌లో ఉంటే ఐరన్ లోపం తలెత్తదు. హిమోగ్లోబిన్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ పెరిగేందుకు దోహదం చేస్తాయి.
ఆకు కూరలు
శరీరంలో రక్తం స్థాయి పెంచేందుకు సాధ్యమైనంతవరకూ ఆకుపచ్చని కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. రోజూ ఇవి తినడం వల్ల శరీరంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. పాలకూర, బ్రోకలీ, ఐరన్ ఇందుకు బెస్ట్ అని చెప్పవచ్చు.
కిస్‌మిస్
హిమోగ్లోబిన్ సమస్య లేకుండా చేయాలంటే కిస్‌మిస్ మరో మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఎ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచేందుకు దోహదం చేస్తుంది. రోజుకు కనీసం 6-7 కిస్‌మిస్ పండ్లు తినాలి.
బీట్‌రూట్
రక్త హీనత ఉంటే శరీరంలో చాలా రకాల సమస్యలు కన్పిస్తాయి. అందుకే డైట్ ఆరోగ్యంగా ఉండాలి. ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే బీట్‌రూట్‌ను రోజువారీ డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి.