Herbal Tea Benefits: రోజూ హెర్బల్ టీ తాగితే ఈ వ్యాధులన్నీ దూరం
అల్లం టీ
అల్లం టీ ఉదంయ వేళ తీసుకుంటే చాలా మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి దూరమౌతుంది. బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.
మందారం టీ
మందారం టీ అనేది శరీరానికి చాలా మంచిది. చాలా ప్రయోజనకరం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించేందుకు చాలా ఉపయోగకరం.
పసుపు టీ
పసుపు టీ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. శరీరంలో స్వెల్లింగ్, నొప్పి తగ్గుతుంది. పసుపు, నల్ల మిరియాలు టీ అనేది చాలా మంచిది.
సోంపు టీ
సోంపు టీ మరో మంచి ప్రత్యామ్నాయం. ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వును దూరం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్, కడుపు నొప్పి సమస్యలు తొలగిపోతాయి.
దాల్చిన చెక్క టీ
ప్రతిరోజూ ఉదయం టీతో దినచర్య ప్రారంభిస్తుంటారు. పాల టీ తాగడం వల్ల కడుపుకు చాలా ప్రమాదకరం. పరగడుపున టీ తాగడం వల్ల హాని కలుగుతుంది. దీనికంటే దాల్చిన చెక్క టీ తాగితే ఆరోగ్యపరంగా మంచిది. ఆరోగ్యపరంగా చాలా మంచిది.