Adulteration In Spices: మసాలాలు కల్తీ అయ్యాయో లేదో ఇట్టే తెలుసుకోండి!

Mon, 19 Aug 2024-3:07 pm,

ధనియాల పొడి: మనం ప్రతిరోజు ఉపయోగించే మసాలా దినుసులో ధనియాలు ఒకటి. ధనియాలు ఆహారాన్ని రుచికరంగా మారుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ధనియాలకు బదులు చెక్క ముక్కల పొడి లేదా ఇటుకల పొడి కలిపి అమ్ముతున్నారు కొంతమంది.    

ధనియాలలో కల్తిని గుర్తించడానికి ముందుగా మీరు ఒక పాత్రలో నీటిని తీసుకోవాలి. అందులోకి కొంచెం ధనియాల పొడిని చల్లుకోవాలి. ఒకవేల మసాలాలో చెక్కపొడి, ఏదైనా మలినాలు ఉంటే అది నీటిపైన తేలుతుంది.   

కుంకుమపువ్వు: కుంకుమపువ్వుకు ఎంతో ప్రత్యేక ఉంది. దీని ఎక్కువగా గర్భీణీలకు, స్వీటల తయారిలో ఉపయోగిస్తారు. కుంకుమపువ్వు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కుంకుమపువ్వుకు బదులుగా ఎండిన మొక్కజొన్నను కలుపుతున్నారు.   

కుంకుమపువ్వు కల్తీ ఆ కాదా అనేది తెలుసుకోవాలంటే ముందుగా ఒక గ్లాసు నీటిలో తీసుకొని కుంకుమపువ్వు ను అందులోకి వేయండి. నకిలీ కుంకుమపువ్వు వెంటనే రంగును కోల్పోతుంది. కానీ నిజమైన కుంకుమపువ్వు క్రమంగా రంగును కోల్పోతుంది.   

పసుపు పొడి: పసుపు పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన అందరీకి తెలుసు. ఇందులో బోలెడు పోషకాలు, ఆయుర్వేద గుణాలు ఉంటాయి.  మీరు వాడుతున్న పసుపు నిజామైనదా లేదా కల్తీ అనేది తెలుసుకోవడానికి ముందుగా ఒక కప్పులో నీళ్లు తీసుకోవాలి.   

నిజమైనా పసుపు పొడి నీటిలో కరిగిన వెంటనే లేత పసుపు రంగులోకి మారుతుంది. కల్తీ పసుపు మాత్రం ముదురు రంగులోకి మారుతుంది. ఈ విధంగా మీరు పసుపును పరీక్షించవచ్చు.   

దాల్చిన చెక్క: దాల్చిన చెక్క పొడిలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఈ పొడిని నీటిలో వేసి కలుపుకొని తాగడం వల్ల  బరువు కూడా తగ్గుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

 అయితే దాల్చిన చెక్కకు కాసియా బెరడును కలుపుతారు కొంతమంది. ఇది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక కాగితంపై దాల్చినచెక్కను పూయాలి. నిజమైన దాల్చిన చెక్క పొర కొద్దిగా వంగి ఉంటుంది. అదే కాసియా బెరడు లోపల అనేక పొరలు ఉంటాయి.   

రెడ్‌ పెప్పర్‌ పొడి: వంటలో కారం పొడి లేనిది ఆహారంలో రుచి ఉండదు. నకిలీ కరం పొడిలో కృత్రిమ సింథటిక్‌ రంగు జోడిస్తారు. దీని ఆహారంలో ఉపయోగించడం వల్ల అనారోగ్యసమస్యలు కలుగుతాయి.  

 దీని ఎలా గుర్తించాలంటే ఒక గ్లాసు నీటిలో పొడిని కలుపుకోవాలి. నీటి కింద ఎరుపు రంగు కనిపిస్తే పొడి నకిలీ అని మనం అర్థం చేసుకోవాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link