హీరో నితిన్ పెళ్లి ఎప్పుడంటే... !!

Sat, 15 Feb 2020-3:37 pm,

హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 16న ఆయన శాలినితో ఏడడుగులు వేయనున్నాడు. హీరో నితిన్, శాలినిల పెళ్లి దుబాయ్ లో జరగనుంది. పెళ్లిని డెస్టినేషన్ మ్యారేజ్ పద్ధతిలో నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

గతంలో హీరో నితిన్ పెళ్లి కథతో నిర్మితమైన వేంకటేశ్వర కళ్యాణం సినిమాలో నటించాడు. ఆ సినిమా..  సంప్రదాయ పద్దతిలో పెళ్లిళ్లు కరువై .. డెస్టినేషన్ మ్యారేజ్ లు ఎక్కువవుతున్నాయని.. ఫలితంగా మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్నారనే సబ్జెక్ట్ తో తీశారు. 

ఇప్పుడు హీరో నితిన్ కూడా అలాంటి మ్యారేజ్ చేసుకోవడం విశేషం. మరోవైపు హీరో నితిన్ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. నితిన్, శాలిని ఎంగేజ్ మెంట్ కు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link