Alia Bhatt Pics: ఆకుపచ్చ గౌనులో ఆలియా భట్ సందడి.. సూపర్ హాట్ లుకింగ్! ఫొటోస్ వైరల్
సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటూ ఆలియా భట్ తన ఫొటోస్ షేర్ చేస్తుంటారు. తాజాగా జీ సినిమా అవార్డ్స్ కార్యక్రమంలో ఆలియా ఆకుపచ్చ గౌనులో సందడి చేశారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం పాపతోనే పూర్తి సమయం గడుపుతున్నారు.
గతేడాది ఆలియా భట్ 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయి కతియావాడి' సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నారు. వేశ్య, సీత పాత్రలలో ఆలియా నట విశ్వరూపం చూపారు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, డియర్ జిందగీ, కపూర్ అండ్ సన్స్, హైవే, రాజీ, 2 స్టేట్స్, హంప్టీ శర్మ కీ దుల్హనియా, బద్రినాథ్ కీ దుల్హనియా, ఉడ్తా పంజాబ్, సడక్ 2 సినిమాలు ఆలియాకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన ఆలియా భట్.. తనదైన నటనతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో భారీ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు.
1993 మార్చి 15న ముంబైలో ఆలియా భట్ జన్మించారు. దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె ఆలియా. పాఠశాల విద్యను ముంబైలోని జమ్నాబాయ్ నర్సీ పాఠశాలలో 2011 మేలో పూర్తి చేశారు.