Rakul Preet Singh Pics: ట్రెడిషనల్ లుక్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. కొంటె చూపులతో కవ్వించేస్తుందిగా!

రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటారు. ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ హవా తగ్గిపోయింది. చివరగా ఆమె 'కొండపొలం' సినిమా చేశారు. ప్రస్తుతం రకుల్ పూర్తిగా బాలీవుడ్‌పై కన్నేశారు.

తెలుగులో లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం సినిమాలలో నటించిన రకుల్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం రకుల్ ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ఆపై 'మిస్ ఇండియా', మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లను అందుకున్నారు.
1990 అక్టోబర్ 10న ఢిల్లీలో రకుల్ ప్రీత్ సింగ్ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి డిగ్రీ పట్టా పొందారు.