Rudrkaksha Benefits: రుద్రాక్షను చేతికి ధరిస్తే ఏమౌతుందో తెలుసా, రుద్రాక్షను అలా ధరించవచ్చా
రుద్రాక్ష ధరించడం వల్ల సౌభాగ్యం, సాఫల్యం, సమృద్ధి మూడు లభిస్తాయి. కానీ రుద్రాక్షను ఎప్పుడూ మంత్రోచ్చారణ తరువాతే ధరించాలి.
రుద్రాక్ష బ్రేస్‌లెట్ అనేది భయం నుంచి విముక్తి కల్పించడమే కాకుండా అదృష్టానికి కారణమౌతుంది.
రుద్రాక్షను చేతికి బ్రేస్‌లెట్ రూపంలో ధరించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరగడమే కాకుండా ఎవర్జీ, సామర్ధ్యం పెరుగుతుంది.
రుద్రాక్షను కొంతమంది మెడలో ధరిస్తారు. కొంతమంది ఉంగరంలా వేసుకుంటారు. ఇంకొంతమంది చేతికి బ్రేస్‌లెట్‌లా ధరిస్తారు.
శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు, శివుడి కటాక్షం పొందేందుకు, కోర్కెలు నెరవేర్చుకునేందుకు రుద్రాక్షను ఉపయోగిస్తుంటారు.
హిందూమత విశ్వాసాల ప్రకారం రుద్రాక్ష ఓ రకమైన కలప. జపమాలరూపంలో ఉంటుంది.