Hindu temple bells: గుడిలో గంటలను కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..

Mon, 06 May 2024-3:31 pm,

హిందూ సంప్రదాయం ప్రకారం మనం ఆచారించే ప్రతిపని, పాటించే ప్రతినియమం వెనుక అనేక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో చాలా మంది ఘంటానాదం చేసి లోపలికి వెళ్తుంటారు. దీని వెనుక అనేక రహాస్యాలు ఉన్నాయని పండితులు చెబుతుంటారు.  

గంటానాదం చేయడం వల్ల మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా దూరమైపోతుంది. దీంతో మనమనస్సు ఒక్కసారిగా ఏకాగ్ర చిత్తంతో ఉంటుంది. దీంతో మనసారా స్వామి వారిని దర్శించుకోవచ్చనిన అంటారు. గుడిలో కొందరు మూడు సార్లు, ఐదు సార్లు గంటలను కొడుతుంటారు. దీని వెనుక కూడా కొన్నికారణాలు చెబుతుంటారు.  

మూడుసార్లు గంటానాదం చేయడం మంచిదని కూడా కొందరుజ్యోతిష్యులు చెబుతుంటారు. ఆలయంలోని గంటలు చాలా పెద్దవిగా ఉంటాయి. వీటి నుంచి వచ్చే శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది. ముఖ్యంగా దేవుడికి ఆరతి ఇచ్చే సమయంలో గంటానాదం చేస్తుంటారు. గంటానాదం అంటే మంగళకరమైనది. అది అందరు దేవతలకు ఆహ్వానం అన్నమాట. 

ఇక్కడున్న దేవుళ్లు కాకుండా అందరికి, మనస్సులో దండంపెట్టుకుంటూ పూజారీ ఆహ్వానిస్తున్నాడని చెబుతుంటారు.గంటానాదంఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగెటివ్ ఎనర్జీ లేదా దుష్టశక్తులు అస్సలు ఉండవు. అందుకు హిందు దేవాలలో, హిందువుల ఇంట్లో తప్పనిసరిగా గంట ఉంటుంది. ప్రతిరోజు పూజలు చేసేసమయంలో గంటానాదం తప్పకుండా చేస్తారు.

ప్రతిరోజు గంటానాదం వినడం వల్ల మన శరీరంలోని కొన్నిరకాల నాడులు, మనకు తెలియకుండానే కొన్ని పాజిటీవ్ శక్తులు అలర్ట్ అవుతాయని, దీంతో పాజిటివ్ ఆలోచనలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు. అందుకే చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రతిఒక్కరు గుడికి వెళ్లినప్పుడు తప్పకుండా గంటానాదం చేస్తుంటారు. 

గంటానాదం చేసినప్పుడు ఓంకారశబ్దం ఉధ్బవిస్తుంది. ఓకారంను వినడం, ఉఛ్ఛరించడం వల్ల కూడా మన శరీరంలో ఏమైన ఆరోగ్య సమస్యలు ఉన్న కూడా దూరమైపోతాయని జ్యోతిష్య పండితులతో పాటు నిపుణులు కూడా చెబుతుంటారు. కొందరు తమకోరికలు నెరవేరాలని గుడిలో, చెట్లకు గంటలు కట్టడం చేస్తుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link