Andhra Pradesh: నేడు ఏపీలోనూ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి.. అసలు కారణం ఇదే..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూళ్లు, కాలేజీలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు కోరుతున్నారు.

నిన్న రాత్రి ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఆయన సంతాపదినంగా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో అన్నీ స్కూళ్లకు కాలేజీలకు సెలవు ప్రకటించారు.

ఇక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఈరోజు సెలవు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన దేశానికి చేసిన సేవ మర్చిపోలేనిది. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఎనలేనివి. నేడు తెలంగాణలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సెలవుదినంగా ప్రకటించారు.
ఇక నిన్నటి వరకు స్కూళ్లు, కాలేజీలకు క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. ఈరోజు నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఇక క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు ఏకంగా జనవరి 1వ తేదీ వరకు సెలవులు ప్రాకటించాయి. అంటే 2వ తేదీ మళ్లి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.